Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ప్రతి రోజూ స్పందనలో పరిష్కారం దొరికిందని ఓ కుటుంబం ఆనందం

Advertiesment
every day
విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (16:20 IST)
ఒక సమస్యతో తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతూ, పరిష్కారం కోసం అన్వేషిస్తున్న సమయంలో దిక్సూచిలా ప్రతిరోజు స్పందన కార్యక్రమం కనబడిందని, ఫిర్యాదు చేసిన ఒక వారం వ్యవధిలోనే తమ సమస్యకు పరిష్కారం దొరికిందని కృష్ణా జిల్లా మండవల్లి చెందిన ఒక కుటుంబం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 
మండవల్లి గ్రామానికి చెందిన చాప్లిన్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం ప్రతి రోజు స్పందన కార్యక్రమంలో తన సొంత మేనత్త తనపై నూజివీడు పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టి వేధిస్తోందని, న్యాయం చేయమని ఎస్పి కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును హనుమాన్ జంక్షన్ సిఐకి ఎస్పీ బదిలీ చేసి, దీనిపై తక్షణమే విచారణ జరిపి, పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఆ సమస్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి అతని సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించినందుకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో చాప్లిన్ అతని తల్లితో కలిసి వచ్చి పుష్పగుచ్ఛం, పండ్లు అందజేసి ఆనందభాష్పాలతో ఎస్.పి  కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 
ఆ కుటుంబం ఎస్పీతో మాట్లాడుతూ, పరిష్కారం కాదేమో అనే సమస్యను అతి తక్కువ సమయంలోనే పరిష్కారం చూపించారని, జిల్లా పోలీసు శాఖకు ఎల్లవేళల రుణపడి ఉంటామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను కాదని తనకన్నా 8 ఏళ్లు తక్కువున్న యువకుడితో ఎఫైర్, భర్తకి తెలియడంతో...