Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రిజ్‌లో పాలే కాదు పాములు కూడా ఉంటాయి.. తీస్తూనే చేయి పెట్టొద్దు

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనిది పాములు దాహం తట్టుకోలేక, ఎండ వేడిమి తాళలేక ఇళ్లలోకి జొరబడుతున్నాయి. చిన్న పాములు కాదు. ఆనకొండ వంటి పెద్దపాములు మనుషులకు తెలీకుండానే ఇంటి ఆటకపైకి వెళ్లి దాక్కుని బతికాంరా బాబో అనుకుంటా గుట్టుగా సేద దీరుతున్నాయి. కొన్ని పాముల

Advertiesment
Fridges
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (07:38 IST)
ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనిది పాములు దాహం తట్టుకోలేక, ఎండ వేడిమి తాళలేక ఇళ్లలోకి జొరబడుతున్నాయి. చిన్న పాములు కాదు. ఆనకొండ వంటి పెద్దపాములు మనుషులకు తెలీకుండానే ఇంటి ఆటకపైకి వెళ్లి దాక్కుని బతికాంరా బాబో అనుకుంటా గుట్టుగా సేద దీరుతున్నాయి. కొన్ని పాములయితే ఇక మావల్ల కాదంటూ నేరుగా ఇంట్లోని ప్రిజ్‌లోకే దూరి చల్లదనాన్ని అనుభవిస్తున్నాయి. మనిషి కంట బడినప్పుడు పాము గుణం పోగొట్టుకోకుండా కస్సుమని కాటేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే, మన  ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి మరి.
 
విషయానికి వస్తే  మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన మిరియాల యాకయ్య ఇంట్లోకి అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము ఎవరికీ తెలీకుండా గుట్టుగా ప్రవేశించింది. మండుతున్న ఎండలకు తట్టుకోలేకనో.. లేక వేసవి తాపం తీర్చుకోవడానికో.. ఎందుకో కానీ ఆ రక్తపింజర నేరుగా ఆ ఇంట్లోని ఫ్రిజ్‌లో ప్రత్యక్షమయింది.  
 
యాకయ్య కూతురు వర్ష చల్లని నీళ్ల కోసం ఫ్రిజ్‌ తలుపు తీయగా డోర్‌కు పైభాగంలో పాము కనిపించింది.కుటుంబ సభ్యులు నెమ్మదిగా కర్రతో పామును కింద పడేయడంతో కాటు వేసేందుకు మీదకు రాగా దాన్ని చంపేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరగా గుర్తించారు.
 
ఈసారి ఎప్పుడైనా ప్రిజ్‌ ఓపెన్ చేసి గబుక్కున లోపల చేయి పెట్టవద్దు. మీ ప్రిజ్‍‌లో కూడా ఏ పామో లేదా తేలో ఉండే ప్రమాదం ఉంటుంది. పాములు కింది ఫ్లోర్లోకే వస్తాయిలే పై అంతస్తుల్లోకి రావు అనే భరోసా కూడ లేదు. వేరే దేశంలో ఆనకొండ వంటి బారీ కొండచిలువ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఒక భవంతిలో దూరి పైభాగంలో ఉన్న అటకలో దాక్కుని కొన్నాళ్లకు బయటపడింది. దాని బరువు తట్టుకోలేక అటకలో కొంత భాగం విరిగి కింది పడటంతో విషయం తెలిసి ఆ యింటివారు వణికిపోయారు. ఎందుకంటే ఎన్నాళ్లనుంచి వారికి తెలీకుండా ఆ కొండ చిలువ అక్కడ ఉందో మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేలాది ఏళ్లుగా గుహల్లోనే నివసిస్తున్న గిరిజన తెగలు. మండువేసవిలో ఏసీలా ఉంటాయట