కడపలో ఇంటి వద్దకే నిత్యావసరాలు

గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:37 IST)
లాక్‌డౌన్‌ కారణంగా కడప ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు సమస్యలు ఎదుర్కొనకుండా ప్రభుత్వం చర్యలు చేట్టింది. ఇందులో భాగంగా కడపలో మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే వచ్చి అమ్మకం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజాద్‌బాషా తెలిపారు.

మొబైల్‌ వాహనాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ .. కడప కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ వారితో సంప్రదించి మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసరాలు విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

వ్యాపారస్తులు వాహనాలకు రోజుకు రూ.400 బాడుగ చెల్లించి డిఎస్‌పి ద్వారా వాహన అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మేయర్‌ కె.సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 1000 ఆర్ధిక సాయం