Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : గవర్నర్ నరసింహన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతను, సీఎంను తానెప్పుడూ చూడలేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని కి

కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : గవర్నర్ నరసింహన్
, సోమవారం, 2 జనవరి 2017 (08:25 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతను, సీఎంను తానెప్పుడూ చూడలేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని కితాబిచ్చారు.  అధికారులు, మంత్రుల్లో టీమ్‌ స్పిరిట్‌ నింపారని, 2017లో తెలంగాణకు మరిన్ని విజయాలు అందించాలంటూ సీఎం కేసీఆర్‌పై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సీనియర్‌ అధికారులు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆవిష్కరణలపై పొగడ్తల జల్లు కురిపించారు. 'రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎవరి సలహాలనైనా కేసీఆర్‌ తీసుకుంటారు. ఇలాంటి సీఎంను నిజంగా నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు ఓ ఆలోచన వచ్చిందంటే చాలు... ఎంతటి అవాంతరాలు ఎదురైనా అమలు చేసేంత వరకు వెనక్కి తగ్గరు' అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వనగా నిలుస్తుందన్నారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక నీటి తొట్టిలాంటిందని గవర్నర్‌ అన్నారు. ఇప్పటికే ఈ పథకానికి చాలా అభినందనలు, ప్రశంసలు వచ్చాయన్నారు. భగీరథ పథకం ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుందని.. మిషన్ కాకతీయ పథకంలో రెండు దశలు పూర్తయ్యాయన్నారు. వీటితో పాటు ఇతర నీటి పారుదల పథకాలు, కార్యక్రమాలు త్వరలోనే ఫలాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం నెలకొంటుందని, రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడుతుందని, ఉత్పత్తి, సరఫరా తగ్గుతాయన్న భయాందోళనలు ఉండేవన్నారు. కానీ, ఈ అపనమ్మకాలను కేసీఆర్‌ తిప్పికొట్టారని కొనియాడారు. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది, తమసోమా జ్యోతిర్గమయ (చీకటి నుంచి వెలుగులోకి ప్రస్థానం) అన్నట్లుగా కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. 
 
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పైనా గవర్నర్‌ అభినందనల జల్లు కురిపించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ఆయన నంబర్‌వన్‌గా నిలిపారని కితాబిచ్చారు. ‘ధనిక, మేధావి వర్గాలకే ఐటీ పరిమితమైందన్న అభిప్రాయాలుండేవి. ప్రభుత్వ విధానాలతో ఐటీ సామాన్యుల దరికి చేరింది’ అని చెప్పారు. టీ-హబ్‌ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అన్వేషణ అని కొనియాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఆత్మ పోయెస్ గార్డెన్‌లో తిరుగుతుందా? చిన్నమ్మకు ముచ్చెమటలు.. నమ్మాలా?