Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత ఆత్మ పోయెస్ గార్డెన్‌లో తిరుగుతుందా? చిన్నమ్మకు ముచ్చెమటలు.. నమ్మాలా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ అపోలో ఆస్పత్రితో పాటు, పోయెస్ గార్డెన్‌లో తిరుగుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అపోలో ఆస్పత్రిలో అమ్మ తిరుగుతుందని కూడా వీడియోలు లీక్ అయ్యాయి. ఈ వీడియ

Advertiesment
Shocking!!! JAYALALITHA GHOST in HOSPITAL GROUND FLOOR haunted CAR PARKING AREA HD CCTV FOOTAGE
, ఆదివారం, 1 జనవరి 2017 (18:09 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ అపోలో ఆస్పత్రితో పాటు, పోయెస్ గార్డెన్‌లో తిరుగుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అపోలో ఆస్పత్రిలో అమ్మ తిరుగుతుందని కూడా వీడియోలు లీక్ అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో, కార్ పార్కింగ్ ఏరియాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం జయమ్మ ఆకారాన్ని పోలిన ఫోటోలు వీడియోలో ఫేస్ బుక్‌లో షేర్ అవుతున్నాయి. 
 
అయితే ఇవన్నీ నిజం కాదని.. గ్రాఫిక్స్‌తోనే ఇవన్నీ చేస్తున్నారని.. వీటిని షేర్ చేయొద్దని.. వైరల్ చేయొద్దని నెటిజన్లు ఆధారాలతో నిరూపిస్తున్నాయి. కానీ పోయెస్ గార్డెన్‌లో అమ్మ ఆత్మ తిరుగుతుందని.. ఆమె నెచ్చెలి శశికళకు ముచ్చెమటలు పట్టిస్తుందని సమాచారం. రాత్రిపూట అమ్మ ఆత్మ బెదిరిస్తుందని.. దీంతో చిన్నమ్మతో పాటు పోయెస్ గార్డెన్‌లో ఉన్నవారు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా అన్నాడీఎంకే ప్రధనా కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆమె కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. జయలలిత చూపిన బాటలోనే నడుస్తానని హామీఇచ్చారు. అమ్మ ఎప్పటికీ తన హృదయంలోనే ఉంటారని కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షిపణుల రూపకల్పనలో వెనక్కి తగ్గేది లేదు.. ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే: కిమ్ జోంగ్