Publish Date: Mon, 12 Oct 2020 (07:25 IST)
Updated Date: Mon, 12 Oct 2020 (07:29 IST)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులు పరిశీలించారు.
వాహన మండపం, గ్యాలరీలో భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే మార్గాలు, బయటికి వెళ్లే మార్గాలను పరిశీలించారు.
భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేశారు.
అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్ర నాథ్, అదనపు ఎస్పీ మునిరామయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.