Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్యావరణ ప్రగతి - మనందరి లక్ష్యం: సజ్జల

పర్యావరణ ప్రగతి - మనందరి లక్ష్యం: సజ్జల
, బుధవారం, 22 జులై 2020 (18:20 IST)
'పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు - పర్యావరణ పరిరక్షణకు పునాదిరాళ్ళు' అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 'నరజాతి మనుగడకు ఆధారం చెట్లు - కోట్లాదిగా నాటండీ మన నేల ఈనినట్లు' అని ఆయన పిలుపునిచ్చారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమంలో భాగంగా... 'రాజన్న వన వికాసం' అనే పుస్తకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణ ప్రగతి - మనందరి లక్ష్యం కావాలన్న సందేశంతో ప్రచురించబడిన ఈ పుస్తకంలో గ్రంధస్తమైన సమాచారాన్ని ఈదర రత్నారావు సేకరించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 
 
అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. దాన్ని నిర్లక్ష్యం వహిస్తే ప్రకృతిలో సమతుల్యత లోపించి యావత్ జగత్ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మనవాళి ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలన్నీ అందుకే జరుగుతున్నాయని ఆయన వివరించారు. అయితే అతివృష్టి- కాకుంటే అనావృష్టి, కరువు-కాటకాలకు ప్రధాన కారణం ప్రకృతిలో సమతుల్యత లోపించడమేనని వెల్లడించారు. 
 
ఈ ప్రకృతి వైపరీత్యాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని  సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అప్పుడే పర్యావరణం మెరుగై ప్రకృతి శాంతిస్తుందన్నారు. అందమైన, ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్ర్కుతమౌతుందని తెలిపారు. పుడమికి హరితహారం సమర్పించడమే జగన్న పచ్చ తోరణం ప్రధాన ఉద్ధేశ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా ఒక్క మానవజాతి మనుగడకే కాక సమస్త జీవకోటికి ఆహారం, ప్రాణవాయువు సమకూర్చే మొక్కలను పెంచుతామంటూ ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు దేవళ్ళ రేవతి, గులాం రసూల్, కొమ్మాలపాటి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో అమానుషం.. కరోనా బాధితురాలిని ఇంట్లోకి రానీయని యజమాని