Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వలన ఇళ్ల పట్టాల పంపిణి చేయలేక పోయాం: సజ్జల

కరోనా వలన ఇళ్ల పట్టాల పంపిణి చేయలేక పోయాం: సజ్జల
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:59 IST)
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129 వ జయంతి వేడుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎస్సీసెల్ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంఎల్ ఏ మేరుగ నాగార్జున, ఎంఎల్ ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ రెడ్డి  మాట్లాడుతూ.. "అంబేద్కర్ ఆశయాలకు వైయస్సార్ కాంగ్రె్స్ పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయలనుకున్నాం.

కాని కరోనా వలన ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం చేయలేక పోయాం. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలియచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధి సిద్ధాంతాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారు. ముఖ్యంగా బడుగుబలహీన వర్గాలకు రాజకీయాధికారం ఇచ్చి వారి సాధికారతకు కృషి చేస్తున్నారు.

వారి అభివృధ్దికి,సంక్షేమానికి అనేక పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. మహిళ సాధికారికతకు సైతం పెద్ద పీట వేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమల్లో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది" అన్నారు.
 
కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి నారాయణమూర్తి, గుంటూరు పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ర్టకార్యదర్శి సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ