Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో గౌతమి చనిపోలేదు.. చంపేశారు.. తల్లి అనంతలక్ష్మి

పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గౌతమి మరణించింది. గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని గౌతమి తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌతమి కేసు మళ్ళీ మొదటికొచ్చిం

Advertiesment
Eluru Girl Gautami's death an accident or murder
, ఆదివారం, 29 జనవరి 2017 (11:39 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గౌతమి మరణించింది. గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని గౌతమి తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌతమి కేసు మళ్ళీ మొదటికొచ్చింది. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిందని పోలీసులు తేల్చిన తర్వాత ఆమె తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదుచేయడం కలకలం రేపుతోంది.
 
విశాఖ జిల్లాలో ఐఎఎస్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఆమె సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన రెండు రోజుల్లోనే ఆమె మరణించింది. అయితే రోడ్డు ప్రమాదంలోనే గౌతమి మరణించిందని రెండు రోజుల క్రితం ఎఎస్ పి రత్న ప్రకటించారు. అయితే రత్న ప్రకటించిన మరునాడే గౌతమి తల్లి మరోసారి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన కూతురును హత్య చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
 
గౌతమి మరణంపై పోలీసులు చెప్పిన వివరాలతో ఆమె తల్లి సంతృప్తి చెందలేదని వార్తలు చెప్తున్నాయి. దీంతో ఆమె తన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తల్లి అనంతలక్ష్మి ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిది: వివేకానందరెడ్డి