Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిది: వివేకానందరెడ్డి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిదని.. అది సాధించకుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ప్రజలు గుణపాఠం చెప్పడం తప్పదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖలో ఆర్

Advertiesment
vivekananda reddy fires on chandra babu
, ఆదివారం, 29 జనవరి 2017 (11:28 IST)
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిదని.. అది సాధించకుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ప్రజలు గుణపాఠం చెప్పడం తప్పదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖలో ఆర్కే బీచ్‌లో జరిగే శాంతియాత్రలో పాల్గొనేందుకు వస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్ట్ రన్‌వేలోనే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ... బాబు వస్తే జాబు వస్తుందని.. బాబు వచ్చారు జాబులు రాలేదని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ... వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాగు, తాగునీటి పనులు ఎన్నో చేశారని గుర్తు చేశారు.
 
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ మద్దతు పలికాయి. అంతేకాకుండా సినీ నటులు కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై అందరికంటే ముందు నుండి పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు.

తెలంగాణ హీరో అయిన సంపూర్ణేష్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ తెలుగులో భారీ చిత్రాలు నిర్మించిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగే వాళ్లకు బుద్ధిలేదని వ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రపతి ఆమోదముద్ర లేకనే.. తిరుచ్చిలో జల్లికట్టు ఉత్సవాలు.. 300 ఎద్దులను అలంకరించి?