జగన్ లోటస్ పాండ్ భవనాన్ని అటాచ్ చేసిన ఈడీ!
హైదరాబాద్: హైదరబాదులో జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న లోటస్ పాండ్ భవనాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జగన్ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ భవనాన్ని అటాచ్ చేసినట్లు ఈడ
హైదరాబాద్: హైదరబాదులో జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న లోటస్ పాండ్ భవనాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జగన్ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ భవనాన్ని అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.
బంజారాహిల్స్‌లోని సాక్షి టవర్స్‌ను కూడా అటాచ్ చేశామని, బెంగళూరులోని ఖరీదైన మంత్రి కామర్స్ వాణిజ్య సముదాయాన్ని కూడా ఇందులో కలిపామని తెలిపారు. ఇంతేకాక పలు కంపెనీల్లో జగన్, భారతి షేర్లను అటాచ్ చేసినట్లు సమాచారం. భారతి సిమెంట్స్ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ కంపెనీకి రూ.152 కోట్ల సున్నపు రాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారించింది.