Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్న బిడ్డపై అఘాయిత్యం చేసిన తండ్రి అరెస్టు

Advertiesment
కన్న బిడ్డపై అఘాయిత్యం చేసిన తండ్రి అరెస్టు
, ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:43 IST)
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో కన్నబిడ్డపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్నపేగు అనే మమకారం లేకుండా.. వావి వరసలు మరిచిపోయి, కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో జరిగిన ఈ ఘటనపై దిశ డీఎస్పీ మురళీమోహన్‌ వెల్లడించిన వివరాల మేరకు.. ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. 
 
ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిసింది. వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆగస్టు 21న ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు : గోనెపల్లి వాగులో ఇద్దరి గల్లంతు