Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ఏపీలో ఎంసెట్ పేరు మార్పు

Advertiesment
Eamset
, శనివారం, 19 జూన్ 2021 (13:07 IST)
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ షెడ్యూల్‎ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ (EAPCET-2021 Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) ‎గా మార్చుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఎప్‎సెట్‎ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
 
నోటిఫికేషన్ వివరాలు..
 
- ఆగ‌స్ట్ 19 నుంచి 25 వ‌ర‌కు ఈఏపీ సెట్ పరీక్షలు
 
- జూన్ 24న నోటిఫికేష‌న్ విడుద‌ల
 
- జూన్ 26 నుంచి జూలై 25 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
 
- జూలై 26 నుంచి ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు 500 లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
 
- అగ‌స్ట్ 6 నుంచి 10 వ‌ర‌కు 1000 రుపాయిల లేట్ ఫీజు‌తో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
 
- అగ‌స్టు 11 నుంచి 15 వ‌రకు 5 వేల రుపాయ‌లు లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
 
- అగ‌స్టు 16 నుంచి 18 వ‌రకు 10 వేల రుపాయిలు లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
 
ఇదిలా ఉంటే.. ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీసెట్, ఎంట్రెన్స్ టెస్ట్‌ల‌ను సెప్టెంబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారంలో నిర్వహించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ