కేంద్రప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా అందజేసే ఈ- పంచాయతీ పురస్కార్ కేటగిరి-2(ఏ)లో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ బహుమతిని సాధించింది. గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తూ వాటి సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకుగానూ ఈ పురస్కారం లభించింది.
ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రధానం చేసిన షీల్డ్‌ను తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌కు బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందచేశారు.
కార్యక్రమంలో మంత్రులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, పంచాయతీరాజ్ సిబ్బందికి మంత్రులు అభినందనలు తెలిపారు.