కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమోటా ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో మునగకాయల ధర పలికింది. తాజాగా మునక్కాయలు కూడా భారీగా పెరిగాయి.
ఒక్క కిలో ఏకంగా రూ.600 ధర పలకడంతో ప్రజలు షాకవుతున్నారు. మునక్కాయ సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 తూగుతాయి. ఈ లెక్కన ఒక్కో మునగకాయ రూ. 30కి పైనే పలికినట్టు రైతులు చెప్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇక్కడ కిలో రూ. 80 నుంచి రూ. 150 మధ్య పలుకుతున్నాయి.