Publish Date: Sat, 16 Dec 2023 (15:52 IST)
Updated Date: Sat, 16 Dec 2023 (15:54 IST)
ఏపీలోని కర్నూలు లాడ్జిలో జంట హత్యలు కలకలం రేపాయి. హోటల్లో ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందిన విజయ్, రుక్సానాగా పోలీసులు గుర్తించారు.
హోటల్లో ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు చెప్తున్నారు.
రుక్సానాకు వివాహం అయ్యి, ఓ కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది.