Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ ఒడి లబ్ధిదారులకు డబుల్ బొనాంజా.. సీఎం జగన్ కీలక నిర్ణయం

అమ్మ ఒడి లబ్ధిదారులకు డబుల్ బొనాంజా.. సీఎం జగన్ కీలక నిర్ణయం
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (21:08 IST)
ఈ 2020 -21 విద్యాసంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా చాలా విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ప్రభుత్వం కొన్ని పాఠశాలలు తెరిచినా.. అది కూడా దశలవారీగానే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2020 -21 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను సడలించింది
 
జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న అమ్మ ఒడి పథకం జనవరి 9, 2021లో ప్రారంభించబోతున్నారు.
 
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి అయితే, ఈ 2020 -21 విద్యాసంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా చాలా విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ప్రభుత్వం కొన్ని పాఠశాలలు తెరిచినా.. అది కూడా దశలవారీగానే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 2020 -21 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, ఈ ఏడాది స్కూల్‌కి వెళ్లినా, వెళ్లకపోయినా అమ్మ ఒడి పథకం కింద డబ్బులను ప్రభుత్వం వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.
 
దీంతో పాటు మరో తీపి కబురు కూడా అందించింది. 2019-20 సంవత్సరంలో పదో తరగతి పాసై, ఆ తర్వాత 2020-21 విద్యా సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా కాలేజీలు తెరవకపోవడంతో ఆఫ్ లైన్, ఆన్ లైన్ కానీ చేరలేకపోయిన, ఆలస్యంగా చేరిన ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకం కింద డబ్బులు వారి తల్లి ఖాతాలో జమ చేస్తారు. అయితే, ఐఐటీ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ ఎంచుకున్న విద్యార్థులకు మాత్రం మినహాయింపు లేదు. వారు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కిందకు వస్తారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.15,000 చొప్పున అందిస్తారు.
 
రూ.15,000 లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో వేసినా, అందులో నుంచి రూ.1000 ను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లకు పంపే వారితో పాటు ప్రైవేట్ స్కూళ్లకు పంపే వారి తల్లి ఖాతాల నుంచి కూడా ఈ నగదు కట్ అవుతుంది. ఆ నగదును జిల్లా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌లో జమ చేస్తారు. దానిని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ కోసం వినియోగిస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతల జాబితాను కూడా రిలీజ్ చేసింది.
 
2019-20 విద్యా సంవత్సరంలో లబ్ధి పొందిన వారితో పాటు అదనంగా ఎవరైతే ఈ ఏడాది 1 నుంచి 12వ తరగతిలోపు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారు అర్హులు. అయితే, అందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.

జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు
 
3 ఎకరాల కంటే తక్కువ మాగాణి, లేదా 10 ఎకరాల లోపు మెట్ట, రెండూ కలిపినా కూడా 10 ఎకరాల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అనర్హులు (శానిటేషన్ వర్కర్లకు మినహాయింపు) నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులు. (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉపాధి ఉన్నవారికి మినహాయింపు)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు .. రిటైర్మెంట్ వయసు పొడగింపు!