Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిచ్చి తుగ్లక్ చెప్పినట్లు వినొద్దు: పోలీసులకు బాబు సూచన

Advertiesment
పిచ్చి తుగ్లక్ చెప్పినట్లు వినొద్దు: పోలీసులకు బాబు సూచన
, గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:44 IST)
పిచ్చి తుగ్లక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు వినొద్దని పోలీసులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. తప్పు చేస్తే ప్రజాకోర్టులో పోలీసులను శిక్షిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 3 రాజధానులు కావాలని ఎవరు అడిగారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఒక్క అవకాశం ఇచ్చినందుకు.. ప్రజలంతా బాధ పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు.

ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది? ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఒక్కసారి ఛాన్స్‌ కోసం ఓటు వేశారు... ఇప్పుడు అనుభవిస్తున్నామంటూ ఆవేదన చెందారు.
 
‘ధైర్యముంటే రాజధాని మారుస్తామని ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సింది. రాజధానిలో ఒకే సామాజికవర్గం ఉందని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. నేను ఒక్క పిలుపు ఇస్తే 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు.

ప్రపంచ చరిత్రలో మరెప్పుడు ఇలాంటిటి జరగదు. రాజధాని రైతులను రోడ్డున పడేశారు. టీడీపీ నేతలపై అట్రాసిటి కేసులు పెడుతున్నారు. ఐదేళ్లలో ఇరిగేషన్‌కు 65 వేల కోట్లు ఖర్చు చేశాం. నదుల అనుసంధానాన్ని పెండింగ్‌లో పెట్టారు.

నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు. వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. మద్యం ధరలు పెంచాడు, జే టాక్స్‌ వేశాడు, కావాలనుకున్న బ్రాండ్లు దొరక్కుండా చేశారు’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి నిరూపిస్తే విషం తాగుతా: పేర్ని నాని