Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేనెటీగలు కుడితే మనిషి ప్రాణం అమాంతంగా పోతుందా.. అంత ప్రమాదమా

తేనెటీగలు కుడితే అటవీ శాఖ అధికారులు, డాక్టర్లు, టీచర్లు ఎవరైనా సరే అదృష్టం బాగుంటేనే బతికిబట్టకడతారు కానీ లేకుంటే ఉన్నపాటున ప్రాణాలు వదలక తప్పదన్నది చాలా ఘటనల ద్వారా మనిషి అనుభవంలో ఉన్నదే. పాములు పగ పట్టడం అనేది హంబగ్ మాత్రమే. కానీ తేనెటీగలు మాత్రం మ

Advertiesment
తేనెటీగలు కుడితే మనిషి ప్రాణం అమాంతంగా పోతుందా.. అంత ప్రమాదమా
హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (07:38 IST)
తేనెటీగలు కుడితే అటవీ శాఖ అధికారులు, డాక్టర్లు, టీచర్లు ఎవరైనా సరే అదృష్టం బాగుంటేనే బతికిబట్టకడతారు కానీ లేకుంటే ఉన్నపాటున ప్రాణాలు వదలక తప్పదన్నది చాలా ఘటనల ద్వారా మనిషి అనుభవంలో ఉన్నదే. పాములు పగ పట్టడం అనేది హంబగ్ మాత్రమే. కానీ తేనెటీగలు మాత్రం మనిషి పట్ల శత్రుభావం ఏర్పర్చుకున్నాయంటే ఆ మనిషి చచ్చేంత వరకు కుడుతూనే ఉంటాయనేది పెద్దలమాట. ఎంత త్వరగా వాటి దాడినుంచి బయటపడతాం అనేది మన  ప్రాణం నిలబడటానికి లేదా పోవడానికి ప్రాతిపదికగా ఉంటుంది.

తేనెటీగల జోలికి మనం పోకున్నా వాటికి మనం ఎలాంటి అపాయం తలపెట్టకపోయినా వాటి దారికి అడ్డువచ్చినా లేక ప్రమాదం జరుగనుందని అవి శంకించినా ఇక వాటి బారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. తేనె పట్టు నుంచి తేనె తీసేవారు కూడా తేనెటీగల బారినుంచి తప్పించుకోవడానికి శరీరం మొత్తంగా జనుపనార సంచి కప్పుకుని మరీ జాగ్రత్త పడతారు. జనపనార సంచికి రంధ్రాలు, చిల్లులు పడకుంటేనే అది మనల్ని తేనెటీగల కాటు నుంచి కాపాడుతుంది. ఎందుకంటే మందంగా ఉండే జనపనార సంచిని చీల్చుకుని మనిషిని కాటు వేయడం తేనెటీగకు కష్టం. అందుకే సంచి పూర్తిగా కప్పుకున్న తర్వాతే తేనె పట్టులోంచి తేనెను లాగడానికి ధైర్యం చేస్తారు. 
 
ఈ ప్రస్తావన ఎందుకంటే.. గురువారం భూపాల పల్లి జిల్లాలో డ్యూటీకి ఉదయమే బైక్‌పై బయలు దేరిన ఓ పశువైద్యుడిని రోడ్డు పక్కన మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఉన్నట్లుండి దాటిచేస్తే వంద మీటర్ల దూరం బైకి వేగంగా నడిపించినా అవివదలకపోవడంతో అక్కడే కుప్పగూలి పోయారు. 108 వాహనానికి సమాచారం అందించినా అప్పటికే ఆయన మృతి చెందడం విషాదం కలిగించింది. ఒకే ఒక తేనెటీగ కుట్టినా సరే దాని ముల్లు వెంటనే లాగేయలేకపోతే 24 గంటల పాటు అది సలుపుతూనే ఉంది. భరించరాని నొప్పి. అలాంటిది వందలు వేల సంఖ్యలో ఒకేసారి తేనెటీగలు దాడిచేస్తే ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోయి మనిషి అలాగే చనిపోయే అవకాశం ఎక్కువ. 
 
తేనెటీగ కుడితే దాని ముల్లులోంచి మన ఒంట్లోకి దూరే విషం ప్రమాదకరమైన ఎలర్జీలను కలిగిస్తాయని వైద్యుల సూచన. తేనెను సేకరించేందుకు తేనెటీగలకు ఉపయోగపడే ముల్లుల్లో(కొండీలు) ప్రమాదకర అపిటాక్సిన్‌ విష పదార్థాలు ఉంటాయి. దాడి చేసినప్పుడు బాధితుడి శరీరంలోకి ముల్లుల ద్వారా వాటిని వదులుతాయి. అందుకే తేనెటీగలు కుట్టిన వెంటనే ముల్లులను లాగిపడేయాలి. ఒకేసారి పెద్దఎత్తున తేనెటీగలు దాడి చేస్తే మనిషి శరీరంలో కళ్లు, ముక్కు, గొంతు, చర్మం వంటి అవయవాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. దీంతో మనిషి ఎనఫలాక్సిస్‌ రియాక్షన్‌కు గురవుతాడని వైద్యులు పేర్కొంటున్నారు. 
 
రియాక్షన్‌కు గురైన మనిషిలో శ్వాస ప్రక్రియ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గుండెపై ఒత్తిడి పెరగడం, శ్వాస కష్టంగా మారడం, ఇదే సమయంలో మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. వెంటనే సరైన వైద్యం అందకుంటే కొన్ని సందర్భాల్లో మూడు నిమిషాల్లోనే బాధితుడు మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి మూడు నుంచి ఐదు నిమిషాల్లోగా ఎతినైఫ్రిన్‌ అడ్రినలిన్‌ మందులు అందివ్వాలని సూచిస్తున్నారు.
 
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తేనెటీగలు కుడితే హార్మోన్స్‌ రియాక్షన్స్‌కు గురవుతాయి. ముక్కు, గొంతు భాగాల్లో కుట్టినప్పుడు శ్వాసనాళాలు దెబ్బతింటాయి. దద్దుర్లు, వాపు వస్తాయి. ఊపిరి చాలా కష్టమవుతుంది. దాంతో ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తేనెటీగల బారిన పడ్డామంటే ఎన్ని ముళ్లు మన ఒంటిలో దూరాయనేదే మన ప్రాణం నిలుస్తుందా, పోతుందా అనే విషయాన్ని తేల్చి పడేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా నగదు దాచారు.. దోచుకోడానికే దాడి.. ఎలా దాడి చేశారంటే?