Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయ ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా నగదు దాచారు.. దోచుకోడానికే దాడి.. ఎలా దాడి చేశారంటే?

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్టేట్‌లో దొంగలు పడ్డారంటే నమ్మగలమా? అక్కడి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి హతమార్చి ఆ ఎస్టేట్‌లోని కోట్లాది రూపాయల నగదును దోచుకోవడానికే పన్నాగం పన్ని సక్సెస్ అయ్యారంటే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయని

Advertiesment
జయ ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా నగదు దాచారు.. దోచుకోడానికే దాడి.. ఎలా దాడి చేశారంటే?
హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (04:21 IST)
ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్టేట్‌లో దొంగలు పడ్డారంటే నమ్మగలమా? అక్కడి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి హతమార్చి ఆ ఎస్టేట్‌లోని కోట్లాది రూపాయల నగదును దోచుకోవడానికే పన్నాగం పన్ని సక్సెస్ అయ్యారంటే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయని భావించగలమా. కానీ అందుకే వచ్చామని పట్టుబడిన నిందితులు స్వయంగా చెబుతున్నప్పుడు నమ్మక తప్పదు. కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా దాచిపెట్టిన డబ్బును దోచుకునేందుకే సాహసం చేశామని ఈ సంఘటనలో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులు వాంగ్మూలంలో చెప్పారు.

కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీలో 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. 8,9 నిందితులు జమ్షీర్‌ ఆలి (32),  జిత్తన్‌జాయ్‌ (20)లను పోలీసులు విచారించగా అనేక విషయాలను బైటపెట్టారు. కొడనాడు ఎస్టేట్‌ గురించి తమకు పెద్దగా తెలియదు, జయలలిత కారు డ్రైవర్‌ కనకరాజ్‌ నేతృత్వంలో తాము పనిచేశామని తెలిపారు. మనోజ్‌ నాయకత్వంలో మొత్తం 9 మంది కేరళ నుంచి వచ్చామని తెలిపారు.
 
ఎస్టేట్‌లోకి ప్రవేశించేపుడు సెక్యూరీటీ గార్డులు అడ్డుకోగా కనకరాజ్‌ వారితో సంప్రదింపులు జరిపి లక్షల రూపాయలు ఇస్తాని ఆశపెట్టినట్లు చెప్పారు. అయితే వారు నిరాకరించడంతో దుడ్డుకర్రలతో తలపై మోదగా స్పృహతప్పిపోయారని తెలిపారు. స్పృహరాగానే ఒక సెక్యూరిటీ గార్డు పారిపోగా, మరో గార్డు ఓం బహదూరును కత్తితో నరికి చంపివేసినట్లు తెలిపారు. ఎస్టేట్‌ భవంతితోని జయలలిత, శశికళ బెడ్‌రూంలలోకి ప్రవేశించి అక్కడి ర్యాక్, సూట్‌కేసుల్లో కట్టలు కట్టలుగా నగదు,  మరో మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు ఉండగా, వాటిని కనకరాజ్‌ తీసుకుని అందరం కలిసి తెల్లారేలోగా తప్పించుకున్నట్లు వారు తెలిపారు. 
 
కొడనాడు ఎస్టేట్‌ నుంచి దొంగలించిన నగదు నుంచి కనకరాజ్‌ తమకు చెరి రూ.2లక్షలు ఇచ్చాడని, మిగిలిన సొత్తు, డాక్యుమెంట్లు అతడి వద్దనే ఉన్నాయని వివరించారు. కోవై ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్న మరో ప్రధాన నిందితుడు సయాన్‌ ప్రాణాలు కాపాడితేగానీ కేసు చిక్కుముడి వీడదని పోలీసులు భావిస్తూ వైద్యులకు సూచిస్తున్నారు.
 
నిందితులు జమ్షీర్‌ ఆలి (32),  జిత్తన్‌జాయ్‌ (20)లను పోలీసులు విచారించే ముందు వారి సెల్‌ఫోన్‌ నంబర్లను తనిఖీ చేయగా తమిళనాడుకు చెంది ఒక మాజీ మంత్రి పేరు బైటపడినట్లు తెలుస్తోంది. కొడనాడు సంఘటన జరిగిన తరువాత వీరిద్దరూ పారిపోతుండగా వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. తమకు పలానా మాజీ మంత్రి తెలుసని సెల్‌ఫోన్‌ ద్వారా సంప్రదించారు, సదరు మాజీ మంత్రి వారిద్దరూ తనకు తెలిసిన వారు అని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు. అయితే ఆ తరువాత కేరళలో పట్టుకున్నారు. దీంతో కొడనాడు సంఘటనలో రాజకీయ ప్రముఖల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకుని మాజీ మంత్రిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ ఎస్టేట్‌లో మూలుగుతున్న ధనరాసులు.. అందుకే హత్యలు... జయ మరో బంగ్లాలో డ్యూటీకి వణుకుతున్న పోలీసులు