అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నందువలన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రజలు కొన్ని ముఖ్య జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
స్వీయ సంరక్షణలో చర్యలలో భాగంగా ప్రజలందరూ నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనేటప్పుడు భౌతిక దూరం పాటించాలని, సానిటైజర్లను అందుబాటులో ఉంచుకొని అవసరమైనన్ని సార్లు చేతులు సానిటైజ్ చేసుకోవాలని, మాస్క్ లు తప్పని సరిగా వాడాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు.
ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువమంది ప్రయాణించిన ఎడల క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని,
మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందువలన బయట తిరిగే వారు ఎల్లప్పుడూ మాస్క్ లు ధరించి పోలీస్ వారికి సహకరించి కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టుటకు పోలీసు వారికి సహకరించాలని తెలిపారు.