Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవద్దు: సుప్రీం

Advertiesment
reservations
, గురువారం, 21 మే 2020 (06:16 IST)
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసలు సహా పలువురు నేతలు ..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడాదని తీర్పు వెలువరించింది. తాజాగా మరోసారి ఈ తీర్పును జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర ప్రగతిపై సిఎంతో మేధో మదనం: మంత్రి ఆదిమూలపు సురేష్