Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొల్లపూడిలో దిశ యాప్‌ అవగాహన సదస్సు: పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertiesment
గొల్లపూడిలో దిశ యాప్‌ అవగాహన సదస్సు: పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
, మంగళవారం, 29 జూన్ 2021 (12:54 IST)
విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.
 
 రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.43 కు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి  చేరుకున్నారు.  అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు.

అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌ విధానంలో వీక్షించారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరించారు. దిశా యాప్ పై , డౌన్లోడ్ పై అవగాహన కలిగించే గోడ పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు
 
కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి,డిజిపి గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఏ ఆర్.అనురాధ,రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  తానేటి వనిత,వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్నివెంకట్రామయ్య(నాని),కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని),మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ,ముఖ్యమంత్రి కార్యక్రమల సమన్వయకర్త తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను,యంపీ నందిగo సురేష్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ జె. నివాస్,ఎమ్మెల్సీ లు కరిమున్నిసా,టి. కల్పలత, ఎమ్మెల్యేలు  వసంత కృష్ణప్రసాద్,మల్లాది విష్ణు, కె.పార్థసారథి, జోగి రమేష్,సింహాద్రి రమేష్,కైలే అనిల్ కుమార్,కె.రక్షణానిధి,మొండితోక జగన్మోహన్ రావు, మేకా వెంకట ప్రతాప అప్పారావు,దూలం నాగేశ్వరరావు, కొఠారి అబ్బాయి చౌదరి,ఎపి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి,విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్,దిశా స్పెషల్ ఆఫీసర్లు దీపికా పటేల్,కృత్తిక శుక్లా,డిసిపి విక్రాంత్ పాటిల్,జాయింట్ కలెక్టర్లు కె.మాధవిలత, ఎల్.శివశంకర్,కె.మోహన్ కుమార్,ఇంచార్జి సబ్ కలెక్టర్ కె.రాజ్యలక్షి, జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్,తదితరులు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం కేబినెట్ విస్తరణ! ముహూర్తం ఫిక్స్ చేసిన మోడీ!