Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8న‌ డ‌య‌ల్ యువ‌ర్ టిటిడి ఈవో

Advertiesment
Dial Your TTD EO
, శనివారం, 7 నవంబరు 2020 (07:50 IST)
డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం న‌వంబ‌రు 8వ తేదీన ఆదివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.
 
ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
టిటిడి ఆధీనంలోకి బూర‌గ‌మంద‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం
చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త శ్రీ కె.వెంక‌ట‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల‌కు ఆల‌యానికి సంబంధించిన రికార్డుల‌ను అందించారు.

అనంత‌రం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి అధికారుల‌కు అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండాలి: కృష్ణా జిల్లా కలెక్టరు