Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సజ్జలా.. మీ కొంపకి కూడా బాబు ష్యూరిటీ పథకాలు అందిస్తాం టీడీపీ నేత ధూళిపాళ్ళ

Advertiesment
dhulipalla
, బుధవారం, 22 నవంబరు 2023 (15:31 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవర్ స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జలా తొందరపడకు.. మీ కొంపకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తాం అంటూ వ్యాఖ్యానించారు. "బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ" పథకం కింద ఇతర కుటుంబాలకు అందజేసినట్టుగానే సజ్జల కొంపకు కూడా బాబు పథకాలను అందిస్తామని తెలిపారు. 
 
'బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ' పథకంపై టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. ఈ పథకం ప్రచారంతో వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మేనిఫెస్టో ద్వారా ఏమేం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు మేం ఊరూరా తిరుగుతుంటే వైకాపాకు వచ్చిన నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
"ఎన్నికల హామీలపై ప్రచారం నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుంది? అని నిలదీశారు. వైకాపా ఉన్న ఓటమి ఫ్రస్ట్రేషన్ అంతా ఆఫ్ నాలెడ్జ్ ఫెలో, క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జలలో కనిపిస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం. నువ్వు నీ కొడుకు ఉద్యోగాలు ఊడి నిరుద్యోగులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. టెన్షన్ వద్దు సజ్జలా... మీ అబ్బాయికి యువగళం పథకం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ఎలాంటి వివక్ష లేకుండా మీ కొంపకి కూడా బాబు ష్యూరిటీ పథకాలు అందిస్తాం" అని ధూళిపాళ్ళ నరేంద్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..