Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రగ్స్ వ్యవహారంలో కొందరు పోలీసులు కూడా వుంటున్నారు... ఎపి డిజిపి(వీడియో)

డ్రగ్స్ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా కొన్నిచోట్ల వుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎపి డిజిపి నండూరి సాంబశివరావు. కంచె చేను మేసిందన్న చందంగా ప్రలోభాలకు లొంగిపోయి కొంతమంది పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చుతున్నారని చెప్పారు. పరిధిని దా

Advertiesment
DGP SambasivaRao
, శనివారం, 22 జులై 2017 (16:12 IST)
డ్రగ్స్ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా కొన్నిచోట్ల వుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎపి డిజిపి నండూరి సాంబశివరావు. కంచె చేను మేసిందన్న చందంగా ప్రలోభాలకు లొంగిపోయి కొంతమంది పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చుతున్నారని చెప్పారు. పరిధిని దాటి మాదక ద్రవ్యాల వ్యవహారం వెళుతోందని, గతంలో ఎపిలో డ్రగ్స్ కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేశామని, ప్రస్తుతం కూడా ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 
 
డ్రగ్స్ సూత్రధాని కెల్విన్ పేరు చెప్పిన డిజిపి.. అలాంటి వ్యక్తుల కారణంగా ఎంతోమంది యువతీయువకుల జీవితాలు నాశనమైపోతున్నాయని చెప్పారు. ఎక్సైజ్ శాఖతో కలిసి మాదకద్రవ్యాల నివారణకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎపి లోని 13 జిల్లాల్లో అత్యాధునికమైన కంట్రోల్ రూంలు కలిగిన ఆదర్స పోలీస్టేషన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. 
 
నిన్న కుప్పంలో చంద్రబాబునాయుడు ఆదర్స పోలీస్టేషన్‌ను ప్రారంభించిన అలాంటి స్టేషన్లనే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న డిజిపి అనంతరం మీడియాతో మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..