కలియుగంలో వికృత కార్యాలు జరుగుతాయని మహానుభావులెందరో ముందుగానే చెప్పిన సందర్భాలున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల కారణంగా కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు వయస్సుతో సంబంధం లేకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి.
తాజాగా 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహ ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ వివాహం ఆలయంలో జరగడంతో భక్తులు ఆ పెళ్లిని అడ్డుకున్నారు. దాదాపు 20 ఏళ్ల వ్యత్యాసంలో వున్న వ్యక్తిని 22 ఏళ్ల యువతి పెళ్లాడటాన్ని అక్కడున్న స్థానికులే అంగీకరించలేదు.
కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈ వివాహ తంతును భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 42 ఏళ్ల యువతి పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని చూసిన భక్తులు, భద్రతా సిబ్బంది.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్నారు.
యువతి ఆవేదనను గుర్తించిన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వరుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.