Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Advertiesment
పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు: దేవినేని ఉమామహేశ్వరరావు
, గురువారం, 20 ఆగస్టు 2020 (18:49 IST)
పోలవరం ముంపుమండలాల్లోనివారు వరదల్లో ఎలా ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలోకి రాకముందు అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి, నేడు వారిని ఎలా వరదలపాలు చేశారోప్రజలు తెలుసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలముందు, పాదయాత్రలో అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో చెప్పారని, పోలవరం ముంపుప్రాంతాల్లోని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10లక్షలిస్తామని,  2013 భూసేకరణ చట్టం అమలుచేస్తామని, 2006-07లో రూ.లక్ష15వేలు పొందినవారికి, మరలా ఎకరానికి రూ.5లక్షలిస్తామని, పోలవరం ప్రాజెక్ట్ పునాదులే లేవలేదని, గత ప్రభుత్వాలకు మానవత్వంలేదని నోటికొచ్చినట్లు మాట్లాడారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ హాయాంలో 3,922 కుటుంబాలకు పునారావాసంకల్పించి, సుమారు రూ.6,371 కోట్ల వరకు ఎల్ ఏ ఆర్ అండ్ ఆర్ పై ఖర్చుపెట్టినట్లు ఆయన చెప్పారు.  ఈ ప్రభుత్వం వచ్చాక పోలవరానికి ఎంత ఖర్చు పెట్టిందో, ఎన్నిలక్షల క్యూబిక్ మీటర్ల పనిచేశారో చెప్పాలన్నారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా ఉంటే, జలవనరుల మంత్రి ఎక్కడున్నాడన్నారు. కనీసం ముంపువస్తుందన్న సమాచారం కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేకపోయిందన్నారు.

మంచినీరు, భోజనవసతిలేక అనేక మండలాల్లోని ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, అధికారులెవరూ కనీసం వారివైపు కూడా చూడటం లేదన్నారు. ఏడు ముంపుమండలాల్లో ఏం జరుగుతుం దో బయటప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారన్నారు. ముంపు మండలాల్లో 18వేల కుటుంబాలను ఆదుకుంటున్నామంటూ ట్వీట్లు పెట్టిన విజయసాయి ఇప్పుడేం సమాధానం చెబుతారని దేవినేని నిలదీశారు.

గతేడాది వరదలు వచ్చినప్పుడు రూ.5వేలు ఇస్తామని ముఖ్యమంత్రి చెబితే, ఇప్పుటివరకు అవి నిర్వాసితులకు అందలేదని, మళ్లీ ఇప్పుడు రూ.2వేలు ఇవ్వమని చెప్పడం సిగ్గుచేటని దేవినేని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తిపడి టీడీపీ పోలవరం కడుతోందంటూ నాడు విషప్రచారం చేసినవారు ఇప్పుడు ఏ కక్కుర్తికోసం ప్రాజెక్ట్ కడతామం టున్నా రో సమాధానం చెప్పాలన్నారు.

రివర్స్ టెండరింగ్ లో భాగంగా జరిగిన రూ.500కోట్ల ఇసుక కుంభకోణం బయటకు రాకూడదని, పోలవరం ప్రాజెక్ట్ కి ఇంజనీర్ ఇన్ చీఫ్ లేకుండా చేశారన్నారు. ఇంతవరకు బాధ్యత గల మంత్రెలెవరూ డ్యామ్ సైట్ ను పరిశీలించలేదని, 20లక్షల క్యూసెక్కుల వరకు వరదవస్తుంటే, పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు. సాంకేతికత అందుబాటులో ఉండికూడా, సకాలంలో నిర్వాసితులను ఎందుకు సురక్షిత ప్రదేశాలకు తరలించలేకపోయారో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

18వేల కుటుంబాలను తరలిస్తున్నామంటూ ట్వీట్లు పెట్టిన విజయసాయి ఇప్పుడేం సమాధానం చెబుతాడని, 15 నెలలనుం చీ ఈ ప్రభుత్వం ఏంగడ్డిపీకిందో చెప్పాలన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడిని, తనను తిట్టిన వారంతా నేడుపోలవరం నిర్వాసితులను ఎందుకు గాలికొదిలేశారో చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ టీడీపీ వారిని తిట్టడానికి, అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, జే.సీ.ప్రభాకర్ రెడ్డిని జైలుకు పంపడానికి పనిచేస్తున్నారని ఉమా ఆగ్రహంవ్యక్తం చేశారు.

ప్రాజెక్టులను పండబెట్టిన జగన్ సర్కారు,  కమీషన్ల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాలాడుతోందన్నారు. రివర్స్ టెండరింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అధికారులంతా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని దేవినేని తేల్చిచెప్పారు. పాయింట్ 88 ఎక్సెస్, పాయింట్5శాతం డిస్కౌంట్లు ఏమిటో, వాటివెనకున్న రివర్స్ టెండరింగ్ డ్రామాలేమిటో త్వరలోనే బయటపడతాయన్నారు. 

రౌతుని బట్టి గుర్రం పరిగెత్తుతుందని, ఇదే యంత్రాంగంతో చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ ని 70శాతం పూర్తిచేస్తే, జగన్ ఏం చేశాడన్నారు. ముంపు ప్రాంతాల్లోని వారికి గుక్కెడు తాగునీరు, పిడికెడు ఆహరం, విద్యుత్ ఇవ్వలేని యంత్రాంగం, ప్రభుత్వం ఎందుకున్నట్లని దేవినేని నిగ్గదీశారు. 64 రోజులు జైల్లో ఉంచి, ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నకు డబ్బులు చేరలేదు, ఆర్థిక లావాదేవీలపై ఆధారాలులేవని ఇప్పుడు చెప్పడమేంటని ఉమా ప్రశ్నించారు. 

సెంటుపట్టా భూమి పథకం కింద, ప్రతి నియోజకవర్గంలో ఇళ్లస్థలాల పేరుతో రూ.50నుంచి 100కోట్ల వరకు దోపిడీ చేశారని, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరూ ఈ కుంభకోణంలో మునిగిపోయారని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని దేవినేని డిమాండ్ చేశారు.  ఇళ్లస్థలాల పేరుతో కొండపల్లి ఖిల్లా, రిజర్వ్ ఫారెస్ట్ లోని వందల ఎకరాల్లోని చెట్లనుకొట్టేసి, మట్టిని తరలించి అమ్మకున్న మైలవరం శాసనసభ్యుడిపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.

వసంత కృష్ణప్రసాద్ బాగోతంపై  మీడియాలో వచ్చినా, ప్రతిపక్షం ప్రశ్నించినా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదని ఉమా ఆరోపించారు. ఎమ్మెల్యేపై, ఆయన బావమరిది, వారి బంధువులపై చర్యలు తీసుకోకుండా, తూతూమంత్రంగా చిరుద్యోగులను బలిచేశారన్నారు. షాబాదు – జక్కంపూడి రహదారిలో టీడీపీ కట్టించిన 885 ఇళ్ల పునాదులు కదిలేలా గ్రావెల్ తోలకాలు, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. 

ప్రతిపక్షం తమ బాగోతాన్ని బయటపెట్టిందన్న అక్కసుతో, చివరకు అటవీభూమిని, రెవెన్యూభూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని దేవినేని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాల పేరుతో సాగించిన భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప ప్రభుత్వంలోని పందికొక్కుల్ని శిక్షించలేమని దేవినేని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్న నేపథ్యంలో వీఐపీలు, వీవీఐపీలకోసం కాకులపాడులో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం శంఖుస్థాపన చేసినట్లు వస్తున్న వార్తలపై, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

హెలికాఫ్టర్లలో ఏరియల్ సర్వేలు చేయడం మానేసి, డ్యాముల్లో ఎంతమేర నీటిమట్టం ఉందో, ఎంతవరద వస్తుందో, వచ్చే నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అంచనావేయాలని దేవినేని సూచించారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ పై కక్షసాధిస్తే, ప్రజలకు దిక్కెవరన్న ఆలోచన లేకుండా ప్రభుత్వం వర్గాలపేరుతో కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ నేను తిన్నాను... తింటున్నాను అని చెప్పడేం?: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి