Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో దాండియా, గార్భా మెగా ఈవెంట్

Advertiesment
సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో దాండియా, గార్భా మెగా ఈవెంట్
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (22:20 IST)
విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తుందని క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ తెలిపారు. ప్రధాన టైటిల్ స్పాన్సర్‌గా జిఎం మాడ్యులర్ వ్యవహరిస్తుండగా, రిజిస్ట్రేషన్ల ప్ర్ర్రక్రియ తదుపరి శిక్షణ వేగంగా సాగుతుందన్నారు. 
 
ప్రస్తుత కార్యశాలలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగే శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని శిక్షణ పొందుతున్నారన్నారు. గార్బా, దాండియా 2019 ప్రధాన కార్యక్రమం సెప్టెంబరు 28వ తేదీన లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో  జరగనుండగా, ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్ వ్యవహరిస్తుందని వివరించారు. 
 
ప్రస్తుత కార్యక్రమాన్ని సెప్టెంబరు 28 నాటి మెగా ఈవెంట్ కు ప్రమెషన్ గా నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమంలో పురుషుల విభాగంలో సౌరవ్, మహిళల విభాగంలో మయూరి, ఉత్తమ వేషధారణ విభాగంలో రితిక అగ్రభాగాన నిలిచి బహుమతులు అందుకున్నారు. 
 
మెగా ఈవెంట్లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తారని సుమన్ పేర్కొన్నారు. గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శన ఉంటుందని మరిన్ని వివరాలకు 9849468498, 8317556636, 9121605288 నెంబర్లతో సంప్రదించవచ్చని నేహా జైన్ పేర్కొన్నారు. 
 
మెగా ఈవెంట్ ప్రవేశం కోసం ఎంట్రీ టిక్కెట్లను జ్యోతి కన్వెన్షన్ సెంటర్ నుండి ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పొందవచ్చని , 26 సాయంత్రం వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు.
webdunia
 
కళలతో దేశసమైఖ్యతను చాటేలా గుజరాతీ, రాజస్థానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు. విజయవాడ యువతీయువకుల కోసం ప్రత్యేకంగా 21 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 
 
ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్ధానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా ఆడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నాపెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని సుమన్ మీనా వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం చేస్తూ గేమ్ అంది... ప్రియుడి కళ్లకు గంతలు కట్టి అది కట్ చేసేసింది...