Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సేవలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ

Advertiesment
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సేవలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం తన కుటుంబ సమేతముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం ఎల్.వి.సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆలయ స్థానాచార్యులు, వేదపండితులు వేద ఆశీర్వచనము చేశారు. 
 
అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటమును అందజేసినారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వారు ఆలయములో చేపట్టవలసిన రాతిమండపం, ఇతర అభివృద్ధి పనుల గురించి చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం వివరించారు.
webdunia
 
అనంతర చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రానున్న దసరా మహోత్సవాలు శాస్త్రోక్తముగా, అత్యంత వైభవముగా జరిపించి ప్రతిఒక్క భక్తునికి దర్శనము బాగా జరిగేలా చర్యలు చేపట్టవలసినదిగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేశామని, అలాగే వాస్తురీత్యా, రాతిమండపము, ఇతర అభివృద్ధి పనులకు మంచి సాంకేతిక పరిజ్ఞానముతో పనులు చేపట్టి అమ్మవారి వైభవాన్ని మరింత ఇనుమడింపజేసే విధముగా, ఇంద్రకీలాద్రిపై భక్తులకు పర్యాటకులకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు చర్చలు జరిపారని, అందుకుకావలసిన సహాయ సహకారాలు అందజేయడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్‌కు కొత్త బిల్డింగ్ : అన్ని శాఖలకు ఉమ్మడి భవన సముదాయం