Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్యాన్స్ నేర్పిస్తూ బాలికలను బుట్టలో వేయడం.. అనుభవించడం.. చివరకు?

Advertiesment
Dance master
, శుక్రవారం, 26 జులై 2019 (18:05 IST)
అతనో డ్యాన్స్ మాస్టర్. తన ఏరియాలో ఉన్న పిల్లలకు ఉచితంగా డ్యాన్స్‌లో శిక్షణ కల్పిస్తుంటాడు. అతని మీద నమ్మకంతో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను డ్యాన్స్ క్లాస్‌లో చేర్పిస్తున్నారు. ఉచితమంటే ఇక చెప్పాలా. వందలమంది విద్యార్థులు వచ్చి పడిపోయారు.
 
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. డ్యాన్స్ పేరుతో బాలికలను ట్రాప్ చేయడం.. వారిని వాడుకుని వదిలేయడం.. ఇది ఆ మాస్టర్ అలవాటు. ఆ బాగోతం కాస్తా తాజాగా బయటపడి ఊచలు లెక్కిస్తున్నాడు మాస్టారు.
 
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల బొమ్మయ్యగారి పల్లి పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన పవన్ కుమార్ స్థానికంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. గత ఆరు నెలల నుంచి విద్యార్థినులకు ఈ శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ సమయంలో కొంతమంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. 
 
వారిని బుట్టలో వేసి వారిని అనుభవించేవాడు. అయితే కొన్నిరోజుల పాటు ఇతని బాగోతం బాగానే సాగింది. అయితే గత వారంరోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని లోబరుచుకున్నాడు. మాయమాటలు చెప్పి బండిమీద బెంగుళూరుకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ మూడురోజలు పాటు గడిపాడు. అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రం కోయబత్తూరుకు తీసుకొచ్చాడు. అక్కడ మూడురోజులు గడిపాడు. అయితే తమ కుమార్తె కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
 
దీంతో పోలీసులు పవన్ కుమార్ పైన అనుమానంతో అతని సెల్ నెంబర్‌ను ట్రేస్ అవుట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అతడిని చాకచక్యంగా పట్టుకుని మీడియా ముందుంచారు. ప్రస్తుతం కటాకటాల్లో ఊచలు లెక్కిస్తున్నాడు పవన్ కుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన చేతుల్లోనే స్మార్ట్ ఫోన్ రూపంలో శత్రువులు : హోం మంత్రి సుచరిత