తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి సమీపంలో ఉన్న కాట్రేనికోన వద్ద పెథాన్ తుఫాను తీరాన్ని తాకింది. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటల సయమంలో ఈ తుఫాను తీరాన్నిదాటింది. దీంతో తీరంవెంబడి వీచే గాలుల్లో వేగం ఒక్కసారిగా పెరిగింది. కోస్తా తీరంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది.
తుఫాన్ తీరం దాటడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు విరిగిపడిపోయాయి. ఈ కారణంగా విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయం తెల్సిందే. మొత్తంమీద పెథాయ్ తుఫాను తీరందాటిన తర్వాత పెను విధ్వంసం సృష్టించింది. ఫలితంగా భారీ ఆస్తినష్టం సంభవించింది.