చెప్పినమాట వినలేదని.. యువతి ఫోటోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు..
యువతి తనకు అనుగుణంగా నడుచుకోలేదని ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో ఓ ప్రబుద్ధుడు అప్‌లోడ్ చేశాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి
యువతి తనకు అనుగుణంగా నడుచుకోలేదని ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో ఓ ప్రబుద్ధుడు అప్‌లోడ్ చేశాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. డిగ్రీ చదువుతున్న యువతి పూస గోవర్ధన్‌తో స్నేహం చేసింది. ఆ సమయంలో ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. సోషల్ మీడియా ఖాతాలను కూడా షేర్ చేసుకున్నారు. ఇదే అదనుగా భావించిన అతడు.. యువతి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల చిత్రాలను కాపీ చేసుకున్నాడు. బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని ఆమెతో చెప్పేవాడు.
కానీ అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అతనికి దూరమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన పూస గోవర్థన్ కాపీ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.