Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 రోజుల పసికందుకు వాతలు.. ఎందుకు పెట్టారో తెలుసా...?

Advertiesment
10 రోజుల పసికందుకు వాతలు.. ఎందుకు పెట్టారో తెలుసా...?
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:38 IST)
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు మూఢనమ్మకాలతో పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ పనుల వలన ప్రమాదం ఏమీ లేనట్లయితే ఎవరి నమ్మకాలు వారివి అని వదిలేయచ్చు, కానీ వాటి వలన ప్రాణాలే పోతున్న తరుణంలో వీటిపై అవగాహన కల్పించడం అనివార్యం. 
 
ప్రభుత్వం, అధికారులు ఎన్ని అవగాహన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక గిరిజనులలో ఈ నమ్మకాలు చాలా లోతుగా నాటుకుపోయాయి. అటవీ ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
 
ఇటీవల విజయనగరంలోని ఊబిగుడ్డి గిరిజన గ్రామానికి చెందిన పాడి నర్సమ్మకు జనవరి 25వ తేదీన ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన అయిదు రోజుల తర్వాత బిడ్డ అస్వస్థతకు గురై ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది, ఇంకా పచ్చ కామెర్ల లక్షణాలు కూడా కనిపించడంతో భయపడిన తల్లిదండ్రులు మంత్రసానిని కలిశారు. 
 
ఆమె సూచనల మేరకు చిన్నారికి కడుపు చుట్టూ, చెవి దగ్గర, నదురు, చేయిపై సూదిని కాల్చి వాతలు పెట్టారు. పరిస్థితి చేజారడంతో ప్రాథమిక ఆసుపత్రిలో చేర్చగా ఎనుప సూది వలన ఇన్ఫెక్షన్ సోకిందని, ఇంకా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం వలన ఆక్సిజన్ ఉంచామని, ప్రస్తుత కండీషన్‌పై స్పష్టత ఇవ్వలేమని తెలిపారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. పెళ్లై పిల్లలున్నా ''లవ్'' చిగురించింది..