Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ కడుపులో పండు పెట్టుకుని మోదీని ఆలింగనం చేసుకున్నారు... నారాయణ(వీడియో)

మోడీ, ట్రంప్‌ల కలయిక చూస్తుంటే సుధీర్ఘ కాల గాఢ ప్రేమికుల్లా కనిపిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ ఎద్దేవా చేశారు. వీరిద్దరు కలవడం మొత్తం ఒక నటనేనన్నారాయన. సాఫ్ట్వేర్ రంగంలో భారత యువత హెచ్1బి సమస్యతో సతమతమవుతుంటే దానిపై ప్రధాని ఎందుకు నోరు మెదపరని ప

Advertiesment
CPI Narayana
, బుధవారం, 28 జూన్ 2017 (15:38 IST)
మోడీ, ట్రంప్‌ల కలయిక చూస్తుంటే సుధీర్ఘ కాల గాఢ ప్రేమికుల్లా కనిపిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ ఎద్దేవా చేశారు. వీరిద్దరు కలవడం మొత్తం ఒక నటనేనన్నారాయన. సాఫ్ట్వేర్ రంగంలో భారత యువత హెచ్1బి సమస్యతో సతమతమవుతుంటే దానిపై ప్రధాని ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.
  
అమెరికా వ్యతిరేక విధానాలకు మోడీ వంతపాడినట్లుందని విమర్శించారు. పాకిస్థాన్‌ను టెర్రరిస్ట్ దేశంగా ఎందుకు ప్రధాని చెప్పడం లేదని ప్రశ్నించారు నారాయణ. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులను ఊచకోత కోస్తూనే ఉన్నారని ఆరోపించారు. 
 
లౌకికవాదంపై ఎన్డీయే ప్రభుత్వం దాడి చేస్తోందని, రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్ కు ఓటెయ్యాలని నారాయణ కోరారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు నారాయణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివాజీ... అనంతపురం నుంచి నేను.. అమరావతి నుంచి నీవు... పని ప్రారంభిద్దాం... పవన్ కళ్యాణ్