Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివాజీ... అనంతపురం నుంచి నేను.. అమరావతి నుంచి నీవు... పని ప్రారంభిద్దాం... పవన్ కళ్యాణ్

నటుడు శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే శివాజీకి ప్రాణం. ముందు నుంచీ అన్నయ్య సినిమాలో నటించాలంటే ఎంతో ఇష్టం. అలాంటి అవకాశం చాలాసార్లు శివాజీకి వచ్చింది. అయితే ఆ

Advertiesment
actor sivaji
, బుధవారం, 28 జూన్ 2017 (15:20 IST)
నటుడు శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే శివాజీకి ప్రాణం. ముందు నుంచీ అన్నయ్య సినిమాలో నటించాలంటే ఎంతో ఇష్టం. అలాంటి అవకాశం చాలాసార్లు శివాజీకి వచ్చింది. అయితే ఆ తర్వాత సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని శివాజీ సమాజంలో జరుగుతున్న సంఘటనపై దృష్టి పెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. రకారకాల ఆందోళనలతో శివాజీ ముందుకెళ్ళారు. అయితే ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది గానీ శివాజీకి మాత్రం మంచి పేరే వచ్చింది. ఒక ఉద్యమంలా ప్రత్యేక హోదాను తీసుకెళ్ళడంతో జనంలో శివాజీకి ఒక గుర్తింపు వచ్చింది.
 
ఆ తర్వాత శివాజీ ఏదో ఒక రాజకీయపార్టీలోకి వస్తారనుకుని అందరూ భావించారు. అయితే ఉన్న రాజకీయ పార్టీల కన్నా కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలవైపు వెళ్ళాలన్నది శివాజీ ఆలోచన. అందుకే శివాజీ జనసేన వైపు దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్‌‌తో ఇప్పటికే శివాజీకి మంచి ర్యాపో ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. శివాజీ గతంలో ఆందోళన చేసేటప్పుడు పవన్ స్వయంగా అభినందించారు. 
 
అయితే అప్పట్లో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో లేకపోవడంతో శివాజీ సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆ తర్వాత జనసేన పార్టీలోకి కొత్త రక్తం వెళుతుండటంతో శివాజీ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. నేరుగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కే చెప్పారట శివాజీ. శివాజీ లాంటి వ్యక్తి తన పార్టీలోకి వస్తే పవన్ కాదంటారా. ఎప్పుడైనా మీరు రావచ్చు అని చెప్పారట పవన్. అది కూడా ఎంపి స్థానానికే పోటీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడట పవన్. 
 
గుంటూరు జిల్లా కేంద్రానికి ఈవల కృష్ణా నదిని ఆనుకుని వున్న అమరావతి నుంచి పని ప్రారంభిద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారట. దీనితో పలువురు రాజకీయ నాయకులకు గుబులు పట్టుకున్నదని సమాచారం. మరి పవన్ చేపట్టబోయే పనేంటో... ప్లానేంటో.... వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై ఆధార్ కార్డు లేనిదే పాన్ కార్డు నో: పాన్‌ కార్డుకు ఆధార్‌కు లింకు ఉండాల్సిందే!