Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ : సీపీఐ కె. నారాయణ

Advertiesment
మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ : సీపీఐ కె. నారాయణ
, గురువారం, 26 డిశెంబరు 2019 (13:44 IST)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నారీ, క్యాబ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లీంలు నిరసనకు దిగారు. చెన్నై నుంచి తిరుపతికి వెలుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి తమకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడాలని వినతిపత్రం అందజేశారు.
 
ఈసంధర్భంగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ మత విద్వేషాలను రచ్చగొడుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుంచి హిందువులు, ముస్లీంలు సోదరులు వలే దేశ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. మహాత్మ గాంధీ, ఇందీరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల‌ కేసులో ముస్లీంలు ఉన్నారా? లేక ప్రజా ధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళలో ముస్లీంలు ఉన్నారా? ఏవిధంగా ముస్లీంలను దేశ ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. 
 
బీజేపీ ఆప్రజాస్వామ్యక పాలన వలన గ్రామాల్లో మత విద్వేషాలు రగిలి ప్రాంతాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నామని, జాతి సమైఖ్యతకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నిరాజ్, చంద్రశేఖర్, సీపీఐ నాయకులు, స్థానిక ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభివృద్ధి కోసం రాజధాని మార్పును స్వాగతిస్తా : మంగళగిరి ఎమ్మెల్యే