Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దొంగతనం జరిగిందని పోలీసులకు పిలిపిస్తే.. 15 నిమిషాలు అదేపనిగా.. ఛాతీని చూసిన కానిస్టేబుల్

షీ టీమ్స్‌తో హైదరాబాదులో మహిళల భద్రత సంగతేమో కానీ.. తమ సిబ్బంది బారి నుంచి మహిళల్ని రక్షించలేకపోతున్నారు.. పోలీసులు. దొంగతనం జరిగిన ప్రాంతానికి వెళ్లిన కానిస్టేబుల్.. అక్కడ వివరాలు సేకరించాల్సింది పోయ

దొంగతనం జరిగిందని పోలీసులకు పిలిపిస్తే.. 15 నిమిషాలు అదేపనిగా.. ఛాతీని చూసిన కానిస్టేబుల్
, మంగళవారం, 13 జూన్ 2017 (09:10 IST)
షీ టీమ్స్‌తో హైదరాబాదులో మహిళల భద్రత సంగతేమో కానీ.. తమ సిబ్బంది బారి నుంచి మహిళల్ని రక్షించలేకపోతున్నారు.. పోలీసులు. దొంగతనం జరిగిన ప్రాంతానికి వెళ్లిన కానిస్టేబుల్.. అక్కడ వివరాలు సేకరించాల్సింది పోయి బాధిత మహిళ ఛాతీని అదేపనిగా చూశారు. బాధిత మహిళ పోలీసులకు దీనిపై ట్వీట్‌ చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు.
 
పాతికేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న రిటైర్డ్ ఇంజనీర్ జీడిమెట్ల అపురూప టౌన్‌షిప్‌లో ఒంటరిగా ఉంటారు. ఆయన కుమార్తె అమీర్‌పేటలో నివసిస్తారు. అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకోడానికి అసోంకు చెందిన ఒక వ్యక్తిని నియమించారు. మూడునెలలు మంచిగా పనిచేసిన ఆ వ్యక్తి.. మే 30న ఆయన నిద్రపోతుండగా రూ. 45 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. దీంతో అపురూప కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపురూప కుమార్తె చేసిన ఫిర్యాదుతో ఘటనాస్థలాన్ని వచ్చిన పోలీసులు.. అక్కడ ఆమె వివరాలు చెబుతుంటే ఓ కానిస్టేబుల్‌ నమోదు చేసుకుంటున్నారు. 
 
ఇక మరో కానిస్టేబుల్‌ మాత్రం బాధితురాలి ఛాతీని చూడటం ప్రారంభించారు. 15 నిమిషాల పాటు ఏకధాటిగా అదేపని చేశాడు. దానిపై ఆమె 6వ తేదీన తెలంగాణ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌చేశారు. స్పందన లేదు. నాలుగు రోజుల తర్వాత అంటే 10వ తేదీన బాధితురాలి మిత్రుడు ఒకరు ఇదే అంశాన్ని డీజీపీ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. డీజీపీ ఆ ట్వీట్‌ను సైబరాబాద్‌ పోలీసులకు ఫార్వర్డ్‌ చేశారు. ఇప్పటివరకు ఈ అంశంపై పోలీసులు ఏమాత్రం స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటు రుతుపవన వర్షాలు... ఇటు డిస్కౌంట్ల వర్షాలు.. రిటైలర్లకు జీఎస్టీ షాక్