Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీలో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జర్నలిజం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీలో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జర్నలిజం ప్రారంభం
, గురువారం, 22 జులై 2021 (07:54 IST)
జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రెస్ అకాడమీ తనకు తానుగా తొలి సారిగా జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. ఈ సంధర్భంగా ప్రెస్ అకాడమీ కార్యాలయంలో కోర్సు బ్రౌచర్ ని విడుదల చేసారు. నెల్లూరులోని విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కోర్సును నిర్వహిస్తోంది.

కోర్సు రూపకల్పన తరగతుల నిర్వహణను ప్రెస్ అకాడమీ చేపడితే పరీక్షలు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి గల  జర్నలిస్టులు ఎవరైనా ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు.

కోర్సులో భాగంగా విద్యార్థులకు సంభంధిత మెటీరియల్ అందించడంతో పాటు ఆన్ లైన్ లో తరగతులు  నిర్వహించాలని నిశ్చయించాం. జర్నలిజంలో వున్న వారు, ఆ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు ప్రాథమిక అంశాలపై అవగాహాన పెంచుకునేందుకు ఈ కోర్సు దోహదపడుతుంది. 
 
జర్నలిజంలో వస్తున్న మార్పులు సాంకేతికత అందుబాటులోకి రావటంతో జర్నలిజంలో చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసే పాఠ్యాంశాలతో పాటు నిష్ణాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల గరిష్ఠంగా లబ్ధిపొందే అవకాశం ఉంటుంది.

ప్రెస్ అకాడమీ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా యూనివర్సిటీల సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మైన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. 
 
కోర్సు వివరాలు
మూడు నెలల కాల పరిమితితో నిర్వహించే జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి ఆన్ లైన్ లో తరగతులు ముగిశాక నెల్లూరులోని విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది.

విద్యార్థులు అడ్మిషన్ ధరఖాస్తులో రాసే ఫోన్ నంబర్ కు మెయిల్ ఐడీకి ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తుంటామని విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయ్ కృష్ణా రెడ్డి (ఎల్వీకే) తెలిపారు. 
 
సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం
విద్యార్హత : ఇంటర్మీడియట్
నోటిఫికేషన్ విడుదల : 22-07-2021
దరఖాస్తు చివరి గడువు : 20-08-2021
తరగుతులు ప్రారంభం : సెప్టెంబర్ రెండో వారం
అసైన్మెంట్ల సమర్పణ : నవంబర్ రెండో వారం
తుది పరీక్షలు : డిశంబర్ మొదటి వారం
జర్నలిస్టులకు కోర్సు ఫీజు      : రూ. 1500/- 
 
జర్నలిస్టులు కాకుండా ఈ వృత్తిలో ఆసక్తి గల వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశం వుంది. 
వీరికి కనీస విద్యార్హత డిగ్రీతో పాటు కోర్సు ఫీజు రూ. 3000/-
మరిన్ని వివరాలకు సంప్రందించండి
ఫోన్ నంబర్ : 91541 04393
మెయిల్ ఐడీ : [email protected]

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న విపక్షాలు