ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. శనివారం అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వెళ్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొంటారు.
ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా వెళ్తారు. 10వ తేదీ వరకు ఆ జిల్లాలోనే జగన్ పర్యటన కొనసాగుతుంది.