విశాఖ జిల్లాలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గంగమ్మ తల్లి గుడి జాలర్ల మధ్య మంగళవారం నాడు ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఘర్షణలో సముద్రంలో ఓ బోటుకు నిప్పు పెట్టారు.
రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలో పెద్దజాలరి పేటకు చెందిన నలుగురు మత్స్యకారులకు గాయాలయ్యాయి. రింగ్ వలలతో చేపల చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు.
ఇదే విషయమై రింగ్ వలలతో చేపల వేటాడే వారితో సంప్రదాయ పద్ధతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు గొడవకు దిగుతున్నారు. ఇదే విషయమై ఈ రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.