Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

Advertiesment
జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు.. ఎందుకో తెలుసా?
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:04 IST)
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం ఇవాళ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎంను కలిసారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హుథ్‌ హుథ్‌ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు.

ఇళ్ల నిర్మాణం పూర్తైనందున వాటిని ప్రారంభించి హుథ్‌హుథ్‌ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు.

ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు.

పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదాలకు తావులేని భూములనే ఇవ్వండి: పవన్