Publish Date: Thu, 25 Sep 2025 (23:17 IST)
Updated Date: Thu, 25 Sep 2025 (23:21 IST)
సాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. అక్కడ మత్తుమందు ఇచ్చి కానిస్టేబుల్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక పలమనేరు పీఎస్‌కు వచ్చిన బాధితురాలుకు పలమనేరు హోంగార్డ్, బంగారుపాళ్యం కానిస్టేబుల్ వేధింపులకు గురిచేశారు.
ఈ ఘటనపై ఈనెల 13న ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భర్త వేధింపుల కారణంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంటావూరుకు చెందిన బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు. నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే ఆమె అందంగా ఉందని సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్ ఆమెపై కన్నేశాడు. బాధితురాలి ఫిర్యాదులోని ఫోన్ నంబరును తీసుకుని ఆమెకు సాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆమెకు కానిస్టేబుళ్లతో వేధింపులు తప్పలేదు.
ఇక లాభం లేదనుకుని పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని దేవరకొండలో ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడా పోలీసులు ఆమెను వదల్లేదు. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేశారు.