Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాడిస్ట్ శైలజా? రాజేష్‌ కాదా? కేసు విచారణలో తలలుపట్టుకుంటున్న పోలీసులు(Video)

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవ వధువు శైలజ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇంతకాలం శైలజ భర్త రాజేష్ లైంగిక సామర్థ్యంపై ఉన్న అనుమానాలు పటాపంచలు కావడంతో అసలు దోషులెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తను మగాడినని నిరూపించుకున్న రాజేష్ త్వరలో నిర్

శాడిస్ట్ శైలజా? రాజేష్‌ కాదా? కేసు విచారణలో తలలుపట్టుకుంటున్న పోలీసులు(Video)
, శనివారం, 20 జనవరి 2018 (14:35 IST)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవ వధువు శైలజ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇంతకాలం శైలజ భర్త రాజేష్ లైంగిక సామర్థ్యంపై ఉన్న అనుమానాలు పటాపంచలు కావడంతో అసలు దోషులెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తను మగాడినని నిరూపించుకున్న రాజేష్ త్వరలో నిర్దోషిగా కూడా బయటపడతానని ధీమాగా చెబుతున్నాడు. 
 
శోభనం రోజే తనపై భర్త తీవ్రంగా దాడి చేశాడంటూ నవ వధువు శైలజ ఆరోపించిన కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త రాజేష్‌‌కు మగతనం లేదంటూ ఆ విషయాన్ని ప్రశ్నించిన కారణంగా తనను తీవ్రంగా గాయపరిచాడంటూ శైలజతో పాటు ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. ముఖంపైన గాయాలతో కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స కూడా చేసుకుంది శైలజ. 
 
కాగా శైలజపై దాడి ఘటనపై మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. దీంతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్సించారు. ఈ దురాఘతానికి పాల్పడ్డ శైలజ భర్త రాజేష్‌ను కఠినంగా శిక్షించాలని అన్నారామె. కొంతకాలం పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లోను రాజేష్ కేసు హల్చల్ చేసింది. పెళ్ళి కాకముందే మగాళ్ళ సెక్స్ సామర్థ్యంపై పరీక్ష నిర్వహించాలన్న కొత్త వాదనకు తెరలేపింది రాజేష్ అంశం. 
 
ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని నిరూపించుకునేందుకు తనకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించాడు రాజేష్. ఎట్టకేలకు స్పందించిన న్యాయమూర్తి రాజేష్‌కు పొటెన్సీ టెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లోని నిమ్స్‌లో రాజేష్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. ఐదురోజుల పాటు 18 రకాల పరీక్షలు నిర్వహించారు నిపుణులు. అయితే అన్ని పరీక్షల్లో రాజేష్‌కు అనుకూలంగా ఫలితం వచ్చింది. వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రాజేష్ లైంగిక సామర్థ్యంపై అనుమానం తోసిపుచ్చుతూ ఆయనకు బెయిల్‌ను జారీచేసింది చిత్తూరు కోర్టు. 
 
రాజేష్ స్పందన ఈ వీడియోలో చూడండి.
 
అయితే అనూహ్యంగా రాజేష్ కేసు మలుపులు తిరగడం ప్రస్తుతం తీవ్ర చర్చను రేపుతోంది. రాజేష్ పైన శైలజ చేసిన ప్రధాన ఆరోపణే వీగిపోవడంతో ఇప్పుడు ఆమె చేసిన మిగతా ఆరోపణల సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజేష్ కూడా తను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటపడతానన్న ధీమా వ్యక్తం చేస్తుండటంతో అసలు ఈ కేసులో నేరం ఎవరిదన్న ప్రశ్న ఉదయిస్తోంది. నిజంగానే రాజేష్ భార్యను హింసించాడా.. లేక గదిలో మరో రకంగా ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ శైలజతో పాటు ఆమె బంధువులను విడివిడిగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. 
 
ఒకవేళ శైలజ చేసిన మిగతా ఆరోపణలు కూడా నిరాధారం అని తేలితే కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తనపై జరిగిన దుష్ప్రచారానికి పరువు నష్టం దావా వేసేందుకు సిద్థమవుతున్నాడు రాజేష్. శైలజతో పాటు ఆమె బంధువులపైనా కేసు వేస్తానంటున్నాడు రాజేష్. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న తనను, తన కుటుంబాన్ని శైలజ ఆమె బంధువులు వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానంటున్నాడు రాజేష్. ఏం జరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్: ఏపీలో టీడీపీకి గడ్డుకాలం.. వైకాపా?