Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిజెపికి దగ్గరయ్యేందుకేనా బాబు ఆరాటం..?

బిజెపికి దగ్గరయ్యేందుకేనా బాబు ఆరాటం..?
, శనివారం, 18 డిశెంబరు 2021 (15:05 IST)
అమరావతి సభలో అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికనై కనిపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మీటింగ్ లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. పార్టీలకతీతంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అమరావతి రైతుల కోసం చివరి వరకు ఎవరు వస్తారోనన్న ఉత్కంఠ కూడా కనిపించింది.

 
అయితే నిన్న సాయంత్రం జరిగిన సభలో చంద్రబాబు బిజెపి నేతలపైన ప్రత్యేక శ్రద్థ చూపించారు. బిజెపి రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు బిజెపి ముఖ్య నేతలందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. సభకు సంఘీభావం తెలుపుదామని.. అందరూ సభాస్థలిపైనే లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు.

 
అయితే బిజెపి నేతలను పక్కకు తోసేసి మిగిలిన పార్టీల నేతలు ముందుకు వచ్చేశారు. దీంతో గమనించిన చంద్రబాబు బిజెపి వారు కనిపించలేదే. వారిని తోసేస్తున్నారు. జరగండి.. జరగండి అంటూ అందరినీ వెనక్కి పంపించి బిజెపి నేతలను ముందుకు పంపారు. 

 
దీంతో చంద్రబాబు బిజెపితో దోస్తీ కోసం పాకులాడుతున్నట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న జమిలీ ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితేనే ఉపయోగం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట. దీంతో ఇప్పటి నుంచే బిజెపికి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రిగారు.. ఏం డ్యాన్సు.. ఏం డ్యాన్సు.. ఇరగదీశారుగా..!