శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను టీడీపీ విడుదల చేసింది.
5న భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో, 6న ముమ్మడివరం నియోజకవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.
ఇక చంద్రబాబు పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ ఛార్జి, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ తెలిపారు.
పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు.
సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు గ్రామ సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతారు. అనంతరం గ్రామంలోని బడుగు, బలహీన వర్గాలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేస్తారు.