Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1995 నాటి చంద్రబాబును చూస్తారు.. కలెక్టర్లకు సీఎం బాబు వార్నింగ్!!

chandrababu naidu

వరుణ్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:03 IST)
జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టివార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే 1995 నాటి చంద్రబాబును చూస్తారని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు తాము పాలన సాగిస్తామని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై, అధికార యంత్రాంగంపై ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. త్వరలోనే తాను కూడా క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేస్తానని తెలిపారు. 
 
అమరావతి కేంద్రంగా సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, అక్టోబరు రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామన్నారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను కలెక్టర్లు గౌరవించాలని తెలిపారు. 
 
ఇకపై తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇదే సందర్భంలో 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్‌లను డ్రైన్లలోకి దింపిన విషయాలను గుర్తుచేశారు. కలెక్టర్లు నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలోనూ పని చేయాలని చంద్రబాబు సూచించారు. అక్టోబరు 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తానని తెలిపిన సీఎం చంద్రబాబు.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచించారు. అలానే ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉంటూ వాటిని కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు చంద్రబాబు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు ఆశ్రమిచ్చిన భారత్... యూకే సర్కారు అనుమతి ఇచ్చేవరకు...