Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన.. అతడిని రియల్ హీరో చేయవద్దు : నేతలతో చంద్రబాబు

ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ టార్గెట్ చేసిన అతన్ని రియల్ జీవితంలో హీరోను చేయవద్దని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ నేతలకు సూచించారు. ఆ

Advertiesment
chandrababu
, గురువారం, 26 జనవరి 2017 (13:32 IST)
ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ టార్గెట్ చేసిన అతన్ని రియల్ జీవితంలో హీరోను చేయవద్దని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ నేతలకు సూచించారు. ఆలా చేస్తే అతడి ట్రాప్‌లో పడిపోయినట్లవుతుందని ఆయన తన అనుచరగణానికి చెప్పినట్టు వినికిండి. 
 
ప్రత్యేక హోదా కోసం పవన్ పదేపదే నిరసన గళం వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వైజాగ్ ఆర్కే బీచ్‌లో గురువారం విద్యార్థులు, యువత తలపెట్టిన మౌన దీక్షకు పవన్ బహిరంగ మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు, మంత్రులంతా కలిసి జనసేనానిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
 
వీటిపై చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి.. అతణ్ణి అనవసరంగా హీరోని చెయ్యవద్దని.. సుజనా, ముద్దుకృష్ణమ, బోండా ఉమా వంటి అనేక మంది నేతలకు సూచించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి మీడియాలో ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చిందని.. అందువల్ల ఆచితూచి అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీవ్ హయాంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు తయారు చేసిన భారత్ : అమెరికా డాక్యుమెంట్లు