Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ హయాంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు తయారు చేసిన భారత్ : అమెరికా డాక్యుమెంట్లు

భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హయాంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాబును భారత్ తయారు చేసిందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ పత్రాలను సీఐఏ

రాజీవ్ హయాంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు తయారు చేసిన భారత్ : అమెరికా డాక్యుమెంట్లు
, గురువారం, 26 జనవరి 2017 (11:43 IST)
భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హయాంలో శక్తిమంతమైన హైడ్రోజన్ బాబును భారత్ తయారు చేసిందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ పత్రాలను సీఐఏ విడుదల చేసింది. ఈ పత్రాల్లోని వాస్తవాలు పలు విషయాలను వెలుగులోకి తెచ్చి కలకలం రేపుతున్నాయి. 
 
మొత్తం 1.2 కోట్ల పేజీలున్న 9.30 లక్షల డాక్యుమెంట్లను సీఐఏ ఆన్‌‌లైన్‌‌లో పోస్టు చేసింది. ఈ డాక్యుమెంట్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి, అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో పరీక్షించిన శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించేందుకు అన్ని లాంఛనాలు పూర్తి చేశారని ఆ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. భారత్ అప్పటికే అణు సాంకేతిక పరిజ్ఞానంలో పాకిస్థాన్ కంటే ఎంతో ముందుందని తెలిపాయి.
 
అంతేకాదు, ఇందిరా గాంధీ చేసిన అణు పరీక్షలను కొనసాగించేందుకు రాజీవ్ గాంధీ అస్సలు ఇష్టపడలేదు. అయితే పాకిస్థాన్ ప్రయత్నాలను, పాక్ కవ్వింపులను పరిగణనలోకి తీసుకున్న రాజీవ్ గాంధీ హైడ్రోజన్ బాంబు సిద్ధం చేసేందుకు సై అన్నారు. ముంబై సమీపంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 36 మంది శాస్త్రవేత్తల టీం హైడ్రోజన్ బాంబును సిద్ధం చేశారు. అయితే ఆయన దానిని పరీక్షించేందుకు మాత్రం అంగీకరించలేదు. ఆ తరువాత 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారని ఈ డాక్యుమెంట్లు వెల్లడించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బికినీ షోలకైతే చంద్రబాబు సర్కారు అనుమతిస్తుందా?: ఆర్కే.రోజా