కందుకూరులో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత చెల్లెలికి జగన్ అన్యాయం చేసాడు. ఆమెకివ్వాల్సిన ఆస్తిని ఇవ్వలేదు. జగన్ దెబ్బకి ఆమె వేరే పార్టీలో చేరాల్సి వచ్చింది. అన్న మీద వుండే కోపంతో ఆమె కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తోంది. ఆమె మాటలకు బాధపడటం లేదు సమాధానాలిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో సోదరితో పాదయాత్రలు చేయించి లబ్ది పొంది అధికారంలోకి రాగానే టిష్యూ పేపరు మాదిరిగా ఆమెను తోసేసారు. ఇపుడు సోషల్ మీడియాలో ఆమెపై నీచమైన ప్రచారం చేయిస్తున్నారు. కనీసం దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఒక అన్నగా చేయాలి కదా. సొంత చెల్లె పుట్టుకపై దారుణమైన ప్రచారాలు జరుగుతుంటే చూస్తూ వూరుకుంటున్నారు, ఇది ఎంత అవమానకరం?
మమ్మల్ని కూడా జగన్ ఇష్టమొచ్చినట్లు తిడుతుంటారు. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్నోసార్లు దూషించారు. చివరికి పవన్ కళ్యాణ్ విసిగిపోయారు. నాకు ముగ్గురు పెళ్లాలు నిజమే కానీ నాలుగో పెళ్లాం గురించి తెలియదు. నా నాలుగో పెళ్లా నువ్వేనేమో జగన్ అని మొన్న సభలో అన్నారు. పవన్ మాటతో వైసిపి వాళ్లకు ఏం చేయాలో తెలియక పీక్కుంటున్నారంటూ చెప్పారు చంద్రబాబు.